బెల్ట్ షాపులపై ఉక్కు పాదం... బొమ్మలరామారం ఎస్సై శ్రీశైలం

77చూసినవారు
బెల్ట్ షాపులపై ఉక్కు పాదం... బొమ్మలరామారం ఎస్సై శ్రీశైలం
బొమ్మలరామారం పోలీసులు బెల్టు షాపు పై చేసిన దాడిలో పదివేలు విలువ చేసే మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లిలోని ఓ బెల్టు షాప్ లో మద్యం విక్రయిస్తున్నారని గురువారం వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఎస్సై శ్రీశైలంతో పాటు క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రాజులు కలిసి దాడి చేసి పట్టుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్