AP: వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పై సమాధానం ప్రారంభించిన మంత్రి వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆయన ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా నాటి, నేటి ప్రభుత్వాల మధ్య తేడాలను చెప్పారు. బాలయ్య డైలాగులు చెబుతూనే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాలను మంత్రి సభ ముందు ఉంచారు. వైసీపీ సమాజానికి హానికరం అంటూ కామెంట్స్ చేశారు.