తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కేవలం 25 వేల కేసులు నమోదైతే.. రేవంత్ రెడ్డి పాలనలో 35 వేల కేసులు నమోదయ్యాయని దుయ్యబట్టారు. ఒక్క సంవత్సరంలోనే 10 వేల కేసులు పెరిగాయంటే.. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావని మండిపడ్డారు.