మీరు.. ఎలాంటి నాన్న.?

65చూసినవారు
మీరు.. ఎలాంటి నాన్న.?
నాన్నలందరికీ పిల్లలంటే ప్రేమే. ఆ ప్రేమని వ్యక్తం చేయడంలో మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. పిల్లల మీద అతి ప్రేమతో మంచీ చెడూ విచక్షణ మరిచే ధృతరాష్ట్రులూ, తాను చెప్పిందే చెయ్యాలని బిడ్డల్ని నరక యాతన పెట్టే హిరణ్యకశిపులూ, చేజేతులా బిడ్డని దూరం చేసుకుని కుమిలిపోయే దశరథులూ. అప్పుడే కాదు, ఇప్పుడూ ఉన్నారు. వాళ్లే కాదు, బిడ్డ కోరితే కొండమీది కోతినైనా తెచ్చిచ్చే డాబుసరి నాన్నలూ, పిల్లల పుట్టినరోజుని అనాథాశ్రమంలో నిర్వహించే నిరాడంబర నాన్నలూ ఉన్నారు.