‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి

54చూసినవారు
‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి
ఆ మధ్య పబ్జీ ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ తరహాలోనే మరో ఘటన జరిగింది. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్(30)కు, UPలోని ఇటావాకు చెందిన హిమాన్షుతో పబ్జీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్ల క్రితం చండీగఢ్‌లో కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెను ఇటావాకు తీసుకురాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగీకారంతోనే అతడిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్