ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలి

62చూసినవారు
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలి
ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని అవి తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనుపోలు ఉదయ్ కిరణ్ (32) అనే యువకుడు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడిన అతడు దాదాపు రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. అవి తీర్చే దారిలేకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్