హైపో థైరాయిడిజం ఉంటే సోయా లేదా సోయా ఉత్పత్తులను అసలు తినకూడదు. సోయా లేదా సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీలను కూడా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్న తరువాత కనీసం 30 నుంచి 60 నిమిషాలు ఆగిన తరువాతే టీ లేదా కాఫీ సేవించాలి. అలాగే ప్రాసెస్ చేయబడిన ఆహారాలను సైతం తీసుకోరాదు.