యువకుడి బ్లాక్‌మెయిల్.. కారులోనే ప్రేమ జంట సజీవ దహనం

53చూసినవారు
యువకుడి బ్లాక్‌మెయిల్.. కారులోనే ప్రేమ జంట సజీవ దహనం
TG: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో సోమవారం ఓ ప్రేమ జంట కారులో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శ్రీరామ్‌ (25), లిఖితల ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని బాలిక బంధువు చింటు (22) బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెద్దలు ఒప్పుకోరని వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బ్లాక్‌మెయిల్‌ విషయాన్ని వివరిస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి కుటుంబీకులకు పంపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్