మహారాష్ట్రలోని షెగావ్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కదులుతున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని అట్టాలి ప్రాంతానికి చెందిన అర్చనగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.