చోరికి యత్నించిన యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

84చూసినవారు
సెల్ ఫోన్ చోరికి యత్నించిన యువకుడిని ఓ యువతి చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు రద్దీగా ఉన్న ఓ మార్కెట్ ప్రాంతంలో యువతి నుంచి సెల్ ఫోన్ కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. అయితే స్థానికులు గమనించి అతడిని పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న యువతితో ఆ దొంగను చెప్పుతో కొట్టించారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్