ఉత్తరాఖండ్ హల్ధ్వానిలోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖాని రోడ్డులో రాత్రి పూట ఇంటికి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలపై రెండు కార్లలో వచ్చిన యువకులు వేధింపులకు పాల్పడ్డారు. వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.