నడి రోడ్డుపై యువకుడి గొంతుకోశాడు(వీడియో)

72చూసినవారు
యూపీలోని బరేలీలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపాటి వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదికొచ్చింది. రింకూ అనే వ్యక్తి మోమోలు అమ్ముతుండగా మహ్మద్ షఫీక్‌తో గొడవ జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రింకూ షఫీక్‌ను షాపు ముందు రోడ్డుపై పడేసి, కత్తితో గొంతు, మెడ కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన షఫీక్ డ్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రింకూ కోసం గాలిస్తున్నారు. ఈ దాడి దృశ్యాలు వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్