తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి (వీడియో)
బ్రెజిల్‌లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు.