హెలెన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది. మిల్టన్ తుఫాన్ ఫ్లోరిడాను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి. ఈ గాలుల ధాటికి రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న వాహన దారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబధించిన భయానక వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది.