ఏపీకి భారీ వర్ష సూచన.. సర్కార్ అలర్ట్

75చూసినవారు
ఏపీకి భారీ వర్ష సూచన.. సర్కార్ అలర్ట్
ఏపీలో ఈ నెల 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పాడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలపై వీటి ప్రభావం ఉంటుందని తెలిపారు. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోం మంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముప్పు రాకుండా అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్