
ఈసారి ఎండలు నిరుడులెక్క ఉండవు!
ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని IMD హెచ్చరికలు జారీచేసింది. ఏప్రిల్-జూన్ మధ్య తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హరియాణా, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీస్తాయని ప్రకటించింది. ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికిమించి నమోదవుతాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పలుచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది.