అనకాపల్లి: సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు.. కలెక్టర్

సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. వచ్చిన ప్రతీ అర్జీని అవగాహన చేసుకోవడం, అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గూర్చి మాట్లాడడం, సమస్య సంబంధిత శాఖ పరిధిలోది కాకపోతే తెలియజేయడం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్