అచ్యుతాపురంలో నిర్మించే ఈఎస్ఐ ఆస్పత్రిపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోమవారం లోకసభలో ప్రస్తావించారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతమందికి వైద్య సేవలు అందుతాయని ప్రశ్నించారు. భూ కేటాయింపు, నిధులు మంజూరు తదితర వివరాలు తెలియచేయాలని కోరారు. కేంద్ర కార్మిక మంత్రి స్పందిస్తూ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించిందని, నిర్మాణానికి రూ. 62 కోట్లు మంజూరు చేశామన్నారు.