నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చిరు వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజినీ మాట్లాడుతూ పిఎం స్వనిధి పథకంలో భాగంగా చిరు వ్యాపారస్తులకు చేయూతనిస్తున్నామన్నారు. 30 మంది వ్యాపారస్తులకు రుణాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటితో వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.