నక్కపల్లి: దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన హోం మంత్రి

శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం రాత్రి నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సత్కరించారు.

సంబంధిత పోస్ట్