అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధి తీగలమెడ అంగన్వాడి కేంద్రంలో సోమవారం బరువు తక్కువ ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆశా కార్యకర్త అమల మాట్లాడుతూ, తల్లిపాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తక్కువ బరువు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు తప్పకుండా ఏరియా ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని ఆమె కోరారు.