గుంటూరు: ఐసీయూలో ఏసీ లు పనిచేయకపోవడం ప్రమాదం

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఏసీలు పనిచేయకపోవడం ప్రమాదం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐసీయూ లో కేవలం ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయని, వాటి వల్ల లోపల చికిత్స తీసుకుంటున్న వారికి ఉక్కపోస్తుందన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్