జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈ మధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి' అని పిలుపునిచ్చారు.