స్వగ్రామంలో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలు

AP: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రెండవ రోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న నాగులమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తన తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మాణమ్మ సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. తర్వాత తన నివాసం వద్ద నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్