ఉత్సాహంగా సాగిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాజమండ్రిలో కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా భారీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. బుధవారం రాజమండ్రిలోని పుష్కరాల రేవు దగ్గర నుంచి గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వరకూ ఈ ర్యాలీ సాగింది. ముందుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కూటమి నాయకులతో కలిసి శాంతికి చిహ్నమైన పావురాలను ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్