మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్చంధంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆపదలో ఉండి రక్తం అవసరం అయిన వాళ్ళకి సకాలంలో రక్తాన్ని అందించే సంకల్పంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతీనెలా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లయితే రక్త కొరత తగ్గుతుంది అని తెలిపారు. ఈ క్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపి, సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు సుమంత్, సబ్బితి ప్రసాద్, వెంకటేష్, గౌరీ శ్రీనివాస్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్