రవికి ఘన సత్కారం

రాజమండ్రిలోని ఎన్జీవో కార్యాలయంలో సామాజిక సేవా రంగంలో ఏషియా వేదిక్ కల్చర్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ స్వీకరించిన చేయూత సంస్థ అధినేత మొండి రవి కుమార్‌ని సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ తరఫున మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాట్లాడుతూ.. చేయూత సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మొండి రవి కుమార్‌కి డాక్టరేట్ రావడం సంతోషకరమని, భవిష్యత్‌లో మరింత మందిని ఆదుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంజీవని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది బీరా రాజు, కిరణ్, స్వప్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్