సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఉమ్మడి తూ. గో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మునగాల హరీశ్వర్ రెడ్డి కొన్ని పోస్టులు చేశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని శుక్రవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచారు.