సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో గురువారం జర్నలిస్ట్ రమేశ్ ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి. ఆర్. నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు ఛైర్మన్ ను కించపరుస్తూ మాట్లాడారని చెప్పారు. నటుడు కృష్ణ మురళిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవల రాజమండ్రిలో కూడా పోసానిపై ఫిర్యాదు చేశారు.