ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్లో కమిషనర్ రవివర్మ గురువారం పంచాయతీ స్థాయి, అవుట్సోర్సింగ్, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. ఫీల్డ్ కి వెళ్లే సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలన్నారు. సెక్షన్ హెడ్స్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, లేనియెడల క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.