మహిళా రక్షక్ లోగోను ఆవిష్కరించిన కలెక్టర్

రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద తూ. గో జిల్లాలోని మహిళలు, బాలికల భద్రత కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ రక్ష కార్యక్రమం లోగోను కలెక్టర్ ప్రశాంతి బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకుంటూ మహిళా రక్షక్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్