సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సిఫార్సు చేస్తాం

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సుప్రీంకోర్టుకు సిఫార్సులు చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని ప్రత్యేక మహిళా కారాగారం వద్ద ఖైదీల సంక్షేమ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా ఖైదీలకు కారాగారంలో అందుతున్న సదుపాయాలపై ఆమె చర్చించారు.

సంబంధిత పోస్ట్