మచిలీపట్నం: స్వామివారి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలకు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రభుత్వపరంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం ఉదయం పాండురంగ స్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ వరకు స్వామి వారి ఉత్సవాలు జరగనున్నాయన్నారు. 15న జరిగే పౌర్ణమి సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్