ఎల్ కోట మండలం బీమాళి కి చెందిన జి సంతోష్ (37) అనే దివ్యాంగుడు పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ పడాల్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో సంతోష్ మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడు విశాఖలో ఓ ఆలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు.