అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు డ్రైవర్‌కి భారీ షాక్ తగిలింది. అధికారులు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలో జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్‌కి ఒక కారు యజమాని దారి ఇవ్వలేదు. అంబులెన్స్ డ్రైవర్ హారన్ మోగిస్తూనే ఉన్నా పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ కారు యజమాని ఇంటికి వెళ్లి రూ. 2.5 లక్షలు జరిమానా విధించారు.