కళ్యాణదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాయల్ ఎన్ఫీల్డ్ అకాడమీ ఉద్యోగ మేళా గురువారం నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ శాఖలలో 59మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో టీపీవో నరేశ్, సివిల్, ఈసీఈ విభాగాల అధికారులు శ్రీధర్ కుమార్, సుధామణి పాల్గొన్నారు.