నగరి: రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నగరి మండలం అగ్రహారంలో రైతులకు ఆదివారం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరై రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్