శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ సింగ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి చరిత్ర ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి అధికారులు ఉన్నారు.