1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది.