భారత పురుషుల హాకీ జట్టు గోల్ కోపర్ పీఆర్ శ్రీజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత హాకీకి వీడ్కోలు పలుకనున్నట్టు సోమవారం శ్రీజేష్ వెల్లడించాడు. గోల్ కీపర్‌గా టీమిండియా విజయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న అతడు సోషల్ మీడియా వేదికగా తన వీడ్కోలు వార్తను అందరితో పంచుకున్నాడు. ‘ఇన్నేండ్లుగా నాపై ప్రేమ కురిపించిన అందరికీ ధన్యవాదాలు’ అని శ్రీజేష్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.