బాక్సింగ్ కు 19ఏళ్ల విరామం ఇచ్చిన మైక్ టైసన్ లో ఆ దుందుడుకు స్వభావం ఇంకా తగ్గలేదు. తాజాగా రింగ్ లోకి దిగకముందే ప్రత్యర్థికి తన పంచ్ రుచి చూపించాడు. నేడు టెక్సాస్లోని ఆర్లింగ్టన్ ఏటీ స్టేడియంలో యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్తో టైసన్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ముందు.. ఇద్దరు బాక్సర్లు వెయిటేజీ ఈవెంట్ లో పాల్గొనగా.. ఆవేశంతో ఉన్న టైసన్ ప్రత్యర్థి పౌల్ చెంప చెల్లుమనిపించాడు. వెంటనే సెక్యూర్టీ వారిని అడ్డుకున్నారు.