ఐటీ సంస్థ డైరెక్టర్‌ అవయవ దానం.. నలుగురికి పునర్జన్మ

AP: ఓ ఐటీ సంస్థ డైరెక్టర్‌ అవయవదానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. ఏపీలోని YSR జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(53) ఓ ఐటీ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. ఈనెల 1న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. 11 రోజుల చికిత్స తరువాత వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆయన భార్య శ్రీదేవి, కుటుంబీకులు అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆయన గుండె, రెండు కిడ్నీలు, కాలేయం అమర్చి మరో నలుగురికి ప్రాణం పోశారు.

సంబంధిత పోస్ట్