బాన్సువాడ పట్టణంలోని కోన బాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం విశ్రాంత ఉపాధ్యాయులు పిచ్చుక హన్మాండ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాములు, పురుషోత్తం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.