ప్రభుత్వ కాలేజీని ఆకస్మిక తనిఖీ చేసిన నోడల్ అధికారి

లింగంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కళాశాల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వార్షిక ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. సిలబస్ తో పాటు EAPSET, NEETకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులకు విశ్లేషించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్