భారీగా గుట్కా, అంబర్‌ పొట్లాల పట్టివేత

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముత్యాల సంతోష్ అనే కిరాణం షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు బస్తాల అంబర్ ప్యాకెట్లు, ఒక గోవా ప్యాకెట్లు ఉన్న బస్తాను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2,45,509 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వీటిని తదుపరి చర్యల నిమిత్తం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్సైలు రఘు,ప్రసాద్, కానిస్టేబుళ్ళు హమీద్, కళింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్