కూసుమంచి మండలం గురువాయిగూడెం వద్ద ఆటో-కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నాయకన్ గూడెంకు చెందిన సుందర్ నాయక్ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అటు ఆయన భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఐదేళ్ల క్రితమే సుందర్ నాయక్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు. ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారీలో ఉండగా, ఎస్ఐ నాగరాజు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.