సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ పై ఎమ్మెల్యే ఫైర్

సత్తుపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మందా రవిబాబుపై స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి ఫైర్ అయ్యారు. ఆదివారం పట్టణ పర్యటనలో భాగంగా 8, 9, 10వ వార్డుల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి డ్రైనేజీ సమస్యలను వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీతో రోగాల బారిన పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే ఎమ్మెల్యే కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్