సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆదివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 17 మందికి చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదకు చేయూతగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.