సిపిఐ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, పూర్ణిమ, నరసయ్య, బాపు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్