తేలికపాటి జల్లులతో వర్షాలు

ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో తేలికపాటి జల్లులతో వర్షాలు పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాలు ఆదివారం మ. 3 గంటలకు 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అన్నారు. అదే సమయంలో తేలికపాటి జల్లులు కూడా పడ్డాయని అన్నారు. అయితే రాబోయే మూడు రోజుల పాటు పలు మండలాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్